మనం నవ్వడం వల్ల శరీరంలో ఎండార్ఫిన్ విడుదలవుతుంది. ఇది మంచి అనుభూతిని కలిగిస్తుంది. మానసిక ఒత్తిడి, ఆందోళనను తగ్గించడంలో ఎండార్ఫిన్ సాయపడుతుంది.

బాగా నవ్వడం వల్ల నొప్పి, అసౌకర్యం నుంచి ఉపశమనం లభిస్తుంది. రోగనిరోధక వ్యవస్థను బలపర్చడంలో నవ్వు సాయం చేస్తుంది. దీంతో అదనపు కేలరీలు బర్న్ అవుతాయి.