కరెంట్ బిల్లుల చెల్లింపు విషయంలో TGSPDCL, APCPDCL కీలక నిర్ణయం తీసుకున్నాయి. ఫోన్ పే ద్వారా విద్యుత్ బిల్లులు చెల్లించవచ్చని ప్రకటించాయి. ఇటీవల ఫోన్ పే, గూగుల్ పే వంటి డిజిటల్ చెల్లింపులకు డిస్కమ్ లు గుడ్ బై చెప్పాయి.

కానీ నెలరోజుల్లోనే సీన్ మొత్తం రివర్స్ అయ్యింది. కరెంట్ బిల్లుల చెల్లింపులు భారీగా తగ్గిపోవడంతో అధికారులు అవాక్కయ్యారు. దీంతో ఫోన్ పే చెల్లింపులను పునరుద్ధరించినట్లు ఉన్నతాధికారులు ప్రకటించారు.