పాకిస్థాన్ లో ముగ్గురు వ్యక్తులకు మంకీపాక్స్ సోకింది. విమానాశ్రయాల్లో పరీక్షల వ్యవస్థను బలోపేతం చేయాలని ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.

వైరస్ బారిన పడిన ముగ్గురు వ్యక్తులు వాయవ్య పాకిస్థాన్ లో ఖైబర్ఫఖ్తుంక్వా ప్రావిన్స్ కు చెందినవారని అధికారులు తెలిపారు. వీరిలో ఇద్దరు సౌదీ అరేబియా నుంచి వచ్చారని చెప్పారు. ఐరోపా దేశం స్వీడన్ లో కూడా ఎంపాక్స్ తొలి కేసు నమోదైంది.