చైనాతో సంబంధం ఉన్న ఆన్లైన్ బెట్టింగ్ యాప్ ‘ఫైవిన్’ ద్వారా రూ.400 కోట్ల మోసానికి పాల్పడిన నలుగురు వ్యక్తులను ఈడీ అదుపులోకి తీసుకుంది.
నిర్వాహకులు ఆ యాప్ ద్వారా అనేక మంది ఆన్లైన్ గేమర్లను మోసం చేశారంటూ కొందరు వ్యక్తులు కోల్ కత్తా లోని కాసిపోర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.
నిందితులను కోల్ కత్తాలోని పీఎంఎల్ఎ ప్రత్యేక కోర్టులో హాజరుపరిచగా, న్యాయస్థానం 14రోజులపాటు కస్టడీ విధించినట్లు వెల్లడించారు.