ఉత్తరప్రదేశ్ లో రైలు ప్రమాదం చోటు చేసుకుంది. కాన్పూర్, భీమ్ సేన్ రైల్వే స్టేషన్ల మధ్య బ్లాక్ సెక్షన్లో సబర్మతి ఎక్స్ ప్రెస్ (19168) పట్టాలు తప్పింది.

ఈ ప్రమాదంలో ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదు. దీంతో రైలులోని ప్రయాణికులను తీసుకెళ్లడానికి రైల్వే అధికారులు ప్రత్యేక బస్సులను ఘటనా స్థలంలో ఏర్పాటు చేశారు.