అంతర్జాతీయ పెట్టుబడులు, నిపుణులను ఆకర్షించేందుకు యూఏఈ ప్రభుత్వం ఇస్తున్న గోల్డెన్ వీసాలకు భారత్ లో క్రేజ్ పెరుగుతోంది.

వివిధ రంగాల్లో నిపుణులు, పెట్టుబడులు పెట్టగలిగిన వారికి యూఏఈ రెడ్ కార్పెట్ పరిచి మరీ స్వాగతిస్తోంది. దీంతో భారత్ నుంచి వెళ్లి విదేశాల్లో స్థిరపడేందుకు సిద్ధమవుతున్న సంపన్నుల్లో చాలామందికి గమ్యస్థానంగా యూఏఈ మారుతోంది.