ఏపీ రాజధాని అమరావతిలో అంతర్జాతీయ ప్రమాణాలతో మరో ప్రతిష్ఠాత్మక యూనివర్సిటీ ఏర్పాటుకానుంది.
జాతీయ న్యాయ విశ్వవిద్యాలయం ఏర్పాటుకు బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(బీసీఐ) ముందుకొచ్చింది. బీసీఐకి చెందిన ‘బీసీఐ ట్రస్ట్ పెర్ల్ ఫస్ట్’ అమరావతిలో లా యూనివర్సిటీ ఏర్పాటుచేస్తుందని ట్విట్టర్ వేదికగా సీఎం చంద్రబాబు తెలిపారు. బీసీఐ అధ్యక్షుడు మన్నన్ కుమార్ మిశ్రాతోపాటు, కీలక సభ్యులతో భేటీ అనంతరం చంద్రబాబు ఈప్రకటన చేశారు.