పార్లమెంట్ లో మరోసారి భద్రతా వైఫల్య ఘటన కలకలం సృష్టిస్తోంది. నిన్న మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో 20ఏళ్ల వయసున్న ఓ యువకుడు ఇంతియాజ్ ఖాన్ మార్గ్ వైపు ఉన్న గోడ దూకి పార్లమెంట్ అనెక్స్ భవనం పరిసరాల్లోకి ప్రవేశించాడు.

అతడిని గమనించిన సీఐఎస్ఎఫ్ భద్రతా సిబ్బంది వెంటనే అదుపులోకి తీసుకుని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. నిందితుడి వద్ద ఎలాంటి ఆయుధాలు లేవని అధికారులు తెలిపారు.