నేడు రక్షాబంధన్ సందర్భంగా దేశవ్యాప్తంగా మెట్రో రైళ్లు ప్రయాణికుల రద్దీతో కిటకిటలాడనున్నాయి.

ఈనేపథ్యంలో ప్రయాణికులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఢిల్లీ మెట్రో ముందు జాగ్రత్తగా రద్దీ ఎక్కువగా ఉండే ఏరియాల లో కొన్ని స్టాండ్ బై రైళ్లను సిద్ధంగా ఉంచనుంది. టికెట్ కౌంటర్ల వద్ద కూడా అదనపు సిబ్బందిని అందుబాటులో ఉంచుతామని.. వీలైతే యూపీఐ యాప్ ల ద్వారా టికెట్లను బుక్ చేసుకోవాలని ప్రయాణికులకు ఢిల్లీ మెట్రో సూచించింది.