దేశంలో 2030 నాటికి లక్ష మంది కంపెనీ సెక్రటరీలు అవసరమవుతారని ఇన్స్టిట్యూట్ ఆఫ్ కంపెనీ సెక్రటరీస్ ఆఫ్ ఇండియా (ICSI) వెల్లడించింది. ఆర్థిక వ్యవస్థ వృద్ధి బాటలో సాగుతుండటం, సుపరిపాలనకు ప్రాధాన్యం పెరుగుతుండటం ఇందుకు కారణాలని తెలిపింది.

ప్రపంచంలోనే అత్యంత ప్రాధాన్యత గల పెట్టుబడి గమ్యస్థానాల్లో ఒకటిగా మన దేశాన్ని మార్చడంలో సీఎస్లు ముఖ్య పాత్ర పోషించారని ఐసీఎస్ఐ ప్రెసిడెంట్ బి.నరసింహన్ తెలిపారు.