డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఇంట్లో చోరీ జరిగిన సంగతి తెలిసిందే. ఈ కేసును ఛేదించిన బంజారాహిల్స్ పోలీసులు ఇద్దరు నిందితుల్ని పశ్చిమ బెంగాల్ నుంచి పీటీ వారెంట్ ద్వారా నగరానికి తీసుకొచ్చారు.

వారిని కోర్టులో హాజరు పర్చచగా 14 రోజుల రిమాండ్ విధించింది. తోటమాలి రోషన్ కుమార్ మండల్ తో పాటు మరో ముగ్గురు చోరీ చేసినట్లు పోలీసులు గుర్తించారు.