డీఎస్సీ -2024 లో ఎంపికైన 10,006 మంది కొత్త టీచర్లు ఇటీవల నియామక పత్రాలు అందుకోగా, కొలువులు సాధించిన అభ్యర్థులకు మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా పోస్టింగులకు సంబంధించి కౌన్సెలింగ్ జరగాలి.

కానీ అనుకోకుండా కౌన్సెలింగ్‌ను వాయిదా వేస్తున్నట్లు విద్యాశాఖ ప్రకటించింది. కొత్త తేదీలను త్వరలోనే ప్రకటిస్తామని తెలిపింది.