తల్లి గర్భంలోని పిండంలోనూ మైక్రోప్లాస్టిక్
మైక్రోప్లాస్టిక్స్ అన్ని జీవాలకు ఆరోగ్యానికి ముప్పు కలిగిస్తాయి. ఈ మేరకు అమెరికాలోని రట్జర్స్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు వీటి గురించి షాకింగ్ విషయాన్ని వెల్లడించారు.
‘సైన్స్ ఆఫ్ ది టోటల్ ఎన్విరాన్‌మెంట్’ జర్నల్ కథనం ప్రకారం.. ఎలుకలపై వారు జరిపిన పరిశోధనలో.. మావి ద్వారా తల్లి గర్భం నుంచి పిండంలోకి మైక్రోప్లాస్టిక్ చేరుతున్నట్టు గుర్తించారు. పాలిమైడ్-12(పీఏ-12) అనే రకమైన ప్లాస్టిక్‌ను తిన్న ఎలుకలకు పుట్టిన పిల్లలను వారు పరీక్షించారు.