జిల్లాలోని ఇద్దరు మండల విద్యాధికారులు , డి సి ఇ బి సెక్రటరీ,జిల్లా సైన్స్ అధికారి ల ప్రవర్తన అక్షేపనీయంగా ఉందని జిల్లా యుఎస్పీసి కమిటీ పాఠశాల ఆర్జేడీ వరంగల్ కు ఫిర్యాదు చేశారు.

జిల్లాలో ఈ మధ్యనే పి ఆర్ టి యు జిల్లా సర్వ సభ్య సమావేశంలో జగిత్యాల రూరల్, గొల్లపల్లి మండల విద్యాధికారులు, జిల్లా డిసీ ఇబి సెక్రటరీ,జిల్లా సైన్స్ అధికారి బ్యాడ్జీలు, సంఘం కండువాలు ధరించి పాల్గొనడం ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకం కావడం వల్ల వారిపై చర్యలు తీసుకోవాలని, స్కూలు కాంప్లెక్సు సబ్జెక్టు ఉపాద్యాయుల సమావేశంలో పి ఆర్ టి యు జిల్లా అధ్యక్షునిగా ఇటీవల ఎన్నికైన వ్యక్తికి డి సి ఇ బి సెక్రటరీ మనోహర చారి ప్రభుత్వ శిక్షణ కార్యక్రమంలో సన్మానం చేయడం నిబంధనలకు విరుద్ధం అని ఇలాంటి చర్యలు విద్యారంగంలో పెను పోకడలకు దారి తీస్తాయని కావున విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని యు ఎస్ పి సి డిమాండ్ చేయడం జరిగింది.

ఈ కార్యక్రమంలో జగిత్యాల జిల్లా టి ఎస్ యు టి ఎఫ్ అద్యక్షులు తీరుకోవెల శ్యామ్ సుందర్, డిటీఫ్ జిల్లా అధ్యక్షులు ఎన్నం రాంరెడ్డి, బిటీ ఎఫ్ జిల్లా అధ్యక్షులు దుమాల శంకర్ బాబు, టిపి టి ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి కొక్కుల రామచంద్రం, టి ఎస్ యు టి ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి అంబటి భూమేశ్వర్ పాల్గొన్నారు.