localnewsvibe

డేట్ ఆఫ్ బర్త్ కు.. ఆధార్ ప్రామాణికం కాదు…అది గుర్తింపు పత్రం మాత్రమే: సుప్రీం  

Caption of Image.

న్యూఢిల్లీ: డేట్ ఆఫ్ బర్త్ కు ఆధార్ ప్రామాణికం కాదని సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది. రోడ్డు ప్రమాదంలో మరణించిన వ్యక్తి వయస్సును అతని ఆధార్ కార్డులోని పుట్టిన తేదీతో నిర్ధారించి పరిహారం చెల్లించవచ్చంటూ గతంలో పంజాబ్- అండ్ హర్యానా  హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు కొట్టివేసింది. వయస్సును నిర్ధారించేందుకు స్కూల్ రికార్డులోని డేట్ ఆఫ్ బర్త్ నే పరిగణనలోకి తీసుకోవాలని స్పష్టం చేసింది. యాక్సిడెంట్లో చనిపోయిన ఓ వ్యక్తి  ఫ్యామిలీకి రూ.19.35 లక్షల పరిహారం ఇవ్వాలని రోహ్ తక్ లోని మోటర్ యాక్సిడెంట్స్ క్లెయిమ్ ట్రిబ్యునల్(ఎంఏసీటీ) ఇటీవల తీర్పు ఇచ్చింది.

ఈ కేసు హైకోర్టుకు చేరింది.  ట్రిబ్యునల్ వయసును తప్పుగా పరిగణనలోకి తీసుకుందన్న హైకోర్టు.. మృతుడి ఆధార్ ఆధారంగా వయసును 47 ఏళ్లుగా నిర్ధారించి పరిహారం రూ.9.22 లక్షలుగా లెక్కకట్టి చెల్లించాలని ఆదేశించింది. దీనిపై బాధిత కుటుంబీకులు సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. స్కూల్ ప్రకారం అతడి వయసు 45 ఏళ్లు మాత్రమేనని వాదించారు. తాజాగా దీనిపై విచారణ జరిపిన జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ ఉజ్జల్ భుయాన్ తో కూడిన సుప్రీం బెంచ్ ఎంఏసీటీ తీర్పునే సమర్థించింది.  

©️ VIL Media Pvt Ltd.