ఫోన్ ట్యాపింగ్ కేసులో .. బెయిల్ కోసం సుప్రీం కోర్టుకెళ్లిన తిరుపతన్న
Caption of Image.
న్యూఢిల్లీ, వెలుగు: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడిగా ఉన్న మాజీ అడిషనల్ ఎస్పీ తిరుపతన్న.. బెయిల్ కోసం సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఈ నెల 20న అడ్వొకేట్ మోహిత్ రావు ఆయన తరఫున పిటిషన్ దాఖలు చేశారు. రిమాండ్‌లో ఉన్న తనకు బెయిల్ మంజూరు చేయాలని తిరుపతన్న కోరారు. జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ ఎన్.కోటీశ్వర్ సింగ్‌తో కూడిన బెంచ్ గురువారం ఈ పిటిషన్‌ను విచారించింది. ఈ సందర్భంగా పిటిషనర్ తరఫున మోహిత్ రావు వాదనలు వినిపించారు. ‘‘ఫోన్ ట్యాపింగ్ కేసులో ఈ ఏడాది మార్చి 23న తిరుపతన్న అరెస్ట్ అయ్యారు.
211 రోజుల నుంచి జైల్లోనే ఉన్నారు. చార్జ్‌షీట్ దాఖలు చేసి కూడా మూడు నెలలైంది’’అని అడ్వొకేట్ మోహిత్ రావు తెలిపారు. బెంచ్ జోక్యం చేసుకుని… ‘‘అసలు 211 రోజుల నుంచి నిందితుడు జైల్లో ఎందుకు ఉన్నారు?’’అని అడ్వొకేట్‌ను బెంచ్ అడిగి తెలుసుకున్నది. ప్రభుత్వం తరఫు నుంచి కూడా వాదనలు వినాల్సి ఉందని తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది.
©️ VIL Media Pvt Ltd.