దుండిగల్ పోలీస్ స్టేషన్ రికార్డులను పరిశీలించిన సీపీ మహంతి
Caption of Image.
దుండిగల్ పోలీసులపై సీపీ ఫైర్
దుండిగల్, వెలుగు: దుండిగల్ పోలీస్‌స్టేషన్‌ను సైబరాబాద్ పోలీస్ కమిషనర్ అవినాష్ మహంతి గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టేషన్ లోని రికార్డులను పరిశీలించారు. పెండింగ్‌కేసుల వివరాలు తెలుసుకుని సిబ్బందిపై మండిపడ్డారు. ఎందుకు పెండింగ్పడుతున్నాయని ప్రశ్నించారు. అనంతరం స్టేషన్ ఆవరణలో మొక్కలు నాటారు. సీపీ వెంట మేడ్చల్ డీసీపీ కోటిరెడ్డి, అడిషనల్ డీసీపీ పురుషోత్తం, సీఐ సతీశ్, ఎస్సైలు ఉన్నారు.
©️ VIL Media Pvt Ltd.