Matka: మట్కా లిరికల్.. కూర్చుంటే ఏదీ రాదు.. కలబడితే నీదే దునియా అంతా

Caption of Image.

‘కూర్చుంటే  ఏదీ రాదు.. నిలబడి చూస్తుంటే కాదు.. కలబడితే నీదే దునియా అంతా’ అంటున్నాడు వరుణ్ తేజ్. తను హీరోగా కరుణ కుమార్ రూపొందిస్తున్న ‘మట్కా’ చిత్రంలో పాటలోని లిరిక్స్ ఇవి. ఇటీవల మొదటి పాటతో మ్యూజిక్ ప్రమోషన్స్ స్టార్ట్ చేసిన మేకర్స్.

గురువారం ‘తస్సాదియ్యా’ అంటూ సాగే రెండో పాటను రిలీజ్ చేశారు. ‘పడిపోతే లేవడం ఎట్టా.. ఎవ్వడినీ అడగొద్దు అంటా.. జీవితమే నేర్పిస్తుంది అంతా.. తస్సాదియ్యా’.. అంటూ సాగిన పాటలో వరుణ్ తేజ్ వింటేజ్ లుక్‌‌లో డిఫరెంట్‌‌ గెటప్‌‌లో ఆకట్టుకున్నాడు. జీవీ ప్రకాష్ కుమార్ పాటను కంపోజ్ చేయగా.. ‘భయమే ఉంటే అసలు నిజమే  కావు కలలే.. బతుకే పందెం.. గెలుపే ముఖ్యం..’ అంటూ  భాస్కరభట్ల ఇన్‌‌స్పైరింగ్ లిరిక్స్‌‌ రాశాడు.

మనో పాడిన విధానం ఆకట్టుకుంది.  మీనాక్షి చౌదరి, నోరా ఫతేహి హీరోయిన్స్‌‌గా నటిస్తున్న ఈ చిత్రంలో నవీన్ చంద్ర, అజయ్ ఘోష్, కన్నడ కిషోర్, రవీంద్ర విజయ్, పి రవి శంకర్, సలోని ఇతర పాత్రలు పోషిస్తున్నారు.  డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల, రజనీ తాళ్లూరి నిర్మిస్తున్నారు. నవంబర్ 14న సినిమా విడుదల కానుంది.

©️ VIL Media Pvt Ltd.