కస్టమర్లకు ఒకేసారి షాక్ ఇచ్చిన స్విగ్గీ, జొమాటో
Caption of Image.
న్యూఢిల్లీ: ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ కంపెనీలు జొమాటో, స్విగ్గీ ప్లాట్‌ఫామ్ ఫీజులను మరోసారి పెంచాయి. పండుగ సీజన్‌లో డిమాండ్ పెరగడంతో ‘ఫెస్టివల్ సీజన్ ప్లాట్‌ఫామ్ ఫీజు’ కింద ఆర్డర్‌కు రూ.10 ను జొమాటో ఛార్జ్ చేస్తోంది. ఈ పెరిగిన రేటు ఢిల్లీ, హైదరాబాద్‌తో సహా మరికొన్ని సిటీలలో అమల్లోకి వచ్చింది. స్విగ్గీ కూడా ప్లాట్‌ఫామ్ ఫీజును తాజాగా పెంచింది. ఈ కంపెనీ 2023 ఏప్రిల్‌లో రూ.2 ప్లాట్‌ఫామ్ ఫీజును వేయడం మొదలు పెట్టింది. అదే ఏడాది ఆగస్టులో జొమాటో కూడా ప్లాట్‌ఫామ్ ఫీజులను వేయడం ప్రారంభించింది. ఫుడ్ ఆర్డర్‌పై వేసే డెలివరీ ఫీజులు, జీఎస్‌టీ, రెస్టారెంట్ ఛార్జీలు, హ్యాండ్లింగ్ ఛార్జీలకు అదనంగా ప్లాట్‌ఫామ్ ఫీజు పడుతుంది.
©️ VIL Media Pvt Ltd.