localnewsvibe

ఈ దీపావళి ఖర్చులు రూ. 1.85 లక్షల కోట్లు

Caption of Image.

స్వీట్లు, బేకరీ ప్రొడక్ట్‌‌‌‌లు, చాక్లెట్లకు ఫుల్ గిరాకీ

న్యూఢిల్లీ: పండుగల సందర్భంగా స్నేహితులకు, కుటుంబ సభ్యులకు, శ్రేయోభిలాషులకు కానుకలు ఇవ్వడం​పెరుగుతోంది. అందుకే ఈసారి ఫెస్టివల్​ సీజన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో, ముఖ్యంగా దీపావళి సందర్భంగా గిఫ్టింగ్ గరిష్ట స్థాయికి చేరుకుంటుందని అంచనా. పట్టణ ప్రాంత వాసులు వీటి కోసం దాదాపు రూ. 1.85 లక్షల కోట్లు ఖర్చు చేస్తారని తాజా స్టడీ వెల్లడించింది. లోకల్​సర్వే సర్కిల్స్​ ప్రకారం.. ఈ ఏడాది సెప్టెంబరు– అక్టోబర్ మధ్య జనం కానుకల కోసం ఇప్పటికే రూ. 1.2 లక్షల కోట్లు ఖర్చు చేశారు. దీపావళికి ముందు  10 రోజులలో కొనుగోళ్లు భారీగా ఉంటాయి.

ఈ సర్వే కోసం లోకల్ సర్కిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మనదేశంలోని 314 జిల్లాల్లోని 31 వేల కుటుంబాల నుంచి వివరాలను సేకరించింది. మెజారిటీ జనం ఇప్పటికీ స్థానికంగా షాపింగ్ చేయడానికి ఇష్టపడుతున్నారు. 57శాతం పట్టణ కుటుంబాలు వ్యక్తిగతంగా బహుమతులను కొనుగోలు చేసి స్వయంగా అందజేస్తున్నట్లు తేలింది.  ఆన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లైన్ షాపింగ్ కూడా వేగంగా పెరుగుతోంది. సర్వేలో పాల్గొన్న వారిలో 36శాతం మంది ఆన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో బహుమతులను కొంటున్నారు.  అయితే 21శాతం మంది మాత్రం ఆన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఆర్డర్ చేసినప్పటికీ, స్వయంగా అందించడానికి ఇష్టపడతామని చెప్పారు. మిగతా వాళ్లు నేరుగా డెలివరీ చేసే విధానాన్ని ఇష్టపడతామని చెప్పారు.  

ఏం కొంటున్నారంటే..

ఈ పండగకు స్వీట్లు, బేకరీ ఉత్పత్తులు లేదా చాక్లెట్లు కొంటామని 53 శాతం మంది రెస్పాండెంట్లు చెప్పారు. చాలా మంది సంప్రదాయ బహుమతులను ఇష్టపడుతున్నారు. డ్రై ఫ్రూట్స్​కు కూడా చాలా గిరాకీ ఉంది. ఈసారి వీటినే బహుమతిగా ఇస్తామని 48శాతం మంది చెప్పారు. మరో  27శాతం మంది రెస్పాండెంట్లు కొవ్వొత్తులు, సువాసనల  దీపాలకు ప్రాధాన్యత ఇచ్చారు.  18శాతం మంది వంటసామాను, 16శాతం మంది రుచికరమైన ఆహారాన్ని, 12శాతం ఇంటి సామాన్లను, 12శాతం మంది ట్రేలు, టపాసులను కొంటామని చెప్పారు.  ప్రతి ఆరుగురిలో ఒకరు వంట సామాగ్రిని బహుమతిగా ఇవ్వాలనుకుంటున్నట్లు పేర్కొన్నారు. సేల్స్ ప్రమోషన్లు,  ప్రత్యేక పండుగ ఆఫర్ల వల్ల బహుమతుల కొనుగోలు కోసం ఎక్కువ మంది ఆన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వైపు చూస్తున్నారని ఒక రెస్పాండెంట్​ చెప్పారు.

©️ VIL Media Pvt Ltd.