హాకీకి మాజీ కెప్టెన్ రాణి రాంపాల్ గుడ్‌బై
Caption of Image.
న్యూఢిల్లీ: ఇండియా విమెన్స్ హాకీ టీమ్ మాజీ కెప్టెన్ రాణి రాంపాల్ 16 ఏళ్ల కెరీర్‌కు గురువారం వీడ్కోలు పలికింది. 2008లో 14 ఏళ్ల వయసులో ఇంటర్నేషనల్ అరంగేట్రం చేసిన రాణి ఇండియా తరఫున 254 మ్యాచ్‌లు ఆడింది. ఇందులో 205 గోల్స్ చేసింది. కెప్టెన్‌గా 2021 టోక్యో ఒలింపిక్స్‌లో టీమ్‌ను నాలుగో స్థానంలో నిలిపింది. హర్యానాలో చిన్న పల్లెటూర్‌లో జన్మించిన రాణిని చిన్నప్పట్నించే పేదరికం వెంటాడింది. తండ్రి తోపుడు బండితో వచ్చిన ఆదాయంతోనే కుటుంబం గడిచేది.
అయితే పేదరికం వెంటాడినా ఏనాడూ హాకీ స్టిక్ విడవని రాణి ఇండియా జట్టులోకి వచ్చిన తర్వాత అద్భుతాలు చేసింది. విమెన్స్ హాకీలో తనకంటూ ఓ ప్రత్యేకమైన అధ్యాయాన్ని లిఖించుకుంది. 2020లో మేజర్ ధ్యాన్‌చంద్ ఖేల్‌రత్న, పద్మశ్రీ అవార్డులను సాధించింది. గత కొన్ని రోజుల నుంచి ఆటకు దూరంగా ఉంటున్న రాణి సబ్ జూనియర్ విమెన్స్ టీమ్ నేషనల్ కోచ్‌గా పని చేస్తోంది.
©️ VIL Media Pvt Ltd.