localnewsvibe

చంద్రుడి ఆవలివైపునా కొన్ని వందల కోట్ల ఏళ్ల క్రితం అగ్నిపర్వత విస్పోటాలు జరిగాయని తాజా పరిశోధన తేల్చింది. జాబిల్లిపై ఇప్పటివరకు వెలుగులోకి రాని ప్రాంతం నుంచి చైనాకు చెందిన చాంగే-6 వ్యోమనౌక మొదటిసారి మట్టి, రాళ్లు తీసుకురాగా పరిశోధకులు వాటిని విశ్లేషించారు.

280కోట్ల సంవత్సరాలనాటి అగ్నిపర్వత శిలల శకలాలతోపాటు 420 కోట్ల ఏళ్ల కిందటి అగ్నిపర్వత శిలల శకలాలూ వాటిలో ఉన్నట్లు గుర్తించారు.