ఇంటర్నెట్ వేగానికి… మనిషిలో కొవ్వు పెరగటానికి అవినాభావ సంబంధం ఉందంటున్నారు శాస్త్రవేత్తలు.
హైస్పీడ్ ఇంటర్నెట్ కారణంగా… చాలామంది, ముఖ్యంగా యువతరం ఆన్లైన్ లో మునిగితేలుతోంది. ఎంజాయ్ చేస్తున్నామనుకుంటూ తమ ఆరోగ్యాన్ని దెబ్బతీసుకుంటున్నారని ఓ అధ్యయనంలో తేలింది.
మెల్బోర్న్ విశ్వవిద్యాలయం, రాయల్ మెల్బోర్న్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సంయుక్తంగా 2006 నుంచి 2019 దాకా ఈ అంశంపై అధ్యయనం చేశాయి.