రకరకాల కారణాల వల్ల భూమిపై మానవ మనుగడకు ముప్పు ఎదురవుతోంది. మనుషులు అంతరించిపోతే ఈ భూమిపై ఆధిపత్యం ఎవరిది అనే విషయంపై కొందరు శాస్త్రవేత్తలు అధ్యయనంచేశారు.

ఆక్టోపస్లు తెలివైనవని, పరిస్థితులకు తగినట్లుగా తమను మలచుకోగలని అధ్యయనం తెలిపింది. దేనినైనా ఉపయోగించుకోగలిగే సామర్థ్యం ఉండి, వాస్తవ, వర్చువల్ వస్తువుల మధ్య తేడాను గుర్తించగలవని, ఈ లక్షణాలు ప్రపంచంపై ఆధిపత్యం సాధించేందుకు వాటికి సహకరిస్తాయని పేర్కొంది.