గడిచిన ఐదేళ్లలో భారత్ లోని విమానయాన సంస్థలకు సంబంధించి 809 నకిలీ బాంబు బెదిరింపు ఘటనలు చోటుచేసుకున్నట్లు కేంద్రం వెల్లడించింది.

ఈ ఒక్క ఏడాదే 719 బెదిరింపు ఘటనలు నమోదైనట్లు పార్లమెంటుకు తెలిపింది. విమానయాన సంస్థలకు 2020 నుంచి ఇప్పటివరకు మొత్తంగా 809 నకిలీ బాంబు బెదిరింపులు వచ్చినట్లు పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి మురళీధర్ మోహోల్ రాజ్యసభలో లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు.