ఓం శ్రీ విఘ్నేశ్వరాయః నమః
ఓం శ్రీ మాత్రే నమః
ఓం నమో నారాయణాయ
ఓం శ్రీ గురుభ్యోనమః

మేషం

మనోబలంతో ముందుకు సాగి అనుకున్నది సాధిస్తారు. అవసరానికి తగిన సహాయం అందుతుంది. బంధుమిత్రులతో కలిసి కీలక నిర్ణయాలు తీసుకుంటారు. భోజన సౌఖ్యం కలదు. ఇష్టదైవారాధన శుభప్రదం.

వృషభం

మధ్యమ ఫలితాలున్నాయి. చేపట్టిన పనులలో ఆటంకాలు ఎదురవుతాయి. బుద్ధిబలంతో వ్యవహరిస్తే సరిపోతుంది. చిన్నపాటి సమస్యలు ఉన్నప్పటికీ మీ బుద్ధిబలం తో వాటిని అధికమిస్తారు. సూర్యాష్టకం చదివితే మంచిది.

మిధునం

వృత్తి, ఉద్యోగ, వ్యాపారాది రంగాలలో ఆశించిన ఫలితాలున్నాయి. ఉత్సాహంగా ముందుకు సాగండి. జన్మ రాశిలో చంద్రబలం బాగుంది. బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు. ఆంజనేయ స్వామిని ఆరాధిస్తే బాగుంటుంది.

కర్కాటకం

చేపట్టిన పనులలో ఆటంకాలు ఎదురైనా అధిగమిస్తారు. ఆపదలు తొలుగుతాయి. సంబంధ బాంధవ్యాలను పటిష్టం చేసుకోవడం మంచిది. ద్వాదశ చంద్రబలం అనుకూలంగా లేదు. అష్టలక్ష్మీస్తోత్రం పఠిస్తే మంచిది.

సింహం

అభివృద్ధికి సంబంధించిన శుభవార్త వింటారు. ఒత్తిడి పెరగకుండా చూసుకోవాలి. కుటుంబసభ్యుల మాట వినండి మంచి జరుగుతుంది. ఇష్టదైవ సందర్శనం ఉత్తమం.

కన్య

అదృష్ట ఫలితాలున్నాయి. మీ మీ రంగాల్లో మంచి జరుగుతుంది కొన్ని వ్యవహారాలలో దైర్యంగా వ్యవహరించి అందరి ప్రశంసలు అందుకుంటారు. శివారాధన మంచిది.

తుల

చేపట్టిన పనులను పట్టుదలతో పూర్తిచేస్తారు. శుభకార్యక్రమాలలో పాల్గొంటారు. కుటుంబంలో కాస్త ఇబ్బందికర వాతావరణం ఏర్పడుతుంది. దక్షిణామూర్తి స్తోత్రం చదివితే మంచిది.

వృశ్చికం

పెద్దల సహకారం తోడ్పడుతుంది. చేపట్టిన పనులలో ఆటంకాలు ఎదురైనా వాటిని అధిగమించే ప్రయత్నం చేస్తారు. ముందుజాగ్రత్త లేకపోవడం వలన అనవసర ఖర్చులు వస్తాయి. కొన్ని సంఘటనలు బాధ కలిగిస్తాయి. హనుమాన్ చాలీసా పఠిస్తే మంచి ఫలితములు లభిస్తాయి.

ధనుస్సు

శుభఫలితాలున్నాయి. బుద్దిబలంతో అందరినీ ఆకట్టుకుంటారు. కుటుంబాభివృద్ధికి సంబంధించిన శుభవార్త వింటారు. మానసికంగా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటారు. ఇష్టదైవారాధన శ్రేయోదాయకం.

మకరం

చేపట్టిన పనులను ప్రణాళికాబద్దంగా పూర్తిచేయగలుగుతారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాది రంగాలలో అనుకూలమైన వాతావరణం ఉంటుంది. మీ అధికార పరిధి పెరుగుతుంది. సంతానాభివృద్దికి సంబంధించిన శుభవార్త వింటారు. గణనాయకాష్టకం పఠిస్తే మంచిది.

కుంభం

అవసరానికి తగిన సహాయం అందుతుంది. బంధుమిత్రుల సలహాలు సూచనలు పారించకపోవడం వలన ఇబ్బందులుపడతారు. ప్రణాళిక లేకపోవడం వలన అనవసర ఖర్చులు పెరుగుతాయి. అలసట పెరుగుతుంది. శివారాధన చేస్తే మంచిది.

మీనం

మిశ్రమ కాలం. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాధన విషయాల్లో శ్రమతో కూడిన ఫలితాలు ఉంటాయి. అందరినీ కలుపుకపోవడం ద్వారాగా మేలైన ఫలితాలు సిద్ధిస్తాయి. చతుర్ధ స్థానంలో చంద్రబలం అనుకూలంగా లేదు. దుర్గా ధ్యానం శుభప్రదం.

Note: (రాశిఫలాలు అనేవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)