కేరళలోని మలప్పురానికి చెందిన కుటుంబసభ్యులు ‘గిన్నిస్ ఫ్యామిలీ ఆఫ్ ఇండియా’గా పేరుపొందారు. చేతులను ఉపయోగించకుండా 8.57 సెకన్లలో అరటిపండు తిని ఆ కుటుంబంలోని అబ్దుల్సలీం గిన్నిస్ రికార్డుల్లోకి ఎక్కారు.

ఆయన కుమార్తె జువైరియా తన మోచేతులు, మోకాళ్లపై నడుస్తూ తలపై చేయిని ఉంచి 54మెట్లు ఎక్కింది. మరోకుమార్తె అయేషా సుల్తానా 16.50 సెకన్లలో ఆరోహణ, అవరోహణ క్రమంలో పుస్తకాలను అమర్చింది. ఇవన్నీ గిన్నిస్ రికార్డుల్లో చోటు పొందాయి.