శ్రీహరికోటలోని సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్ మరో మైలురాయికి సిద్ధమవుతోంది. జనవరిలో 100వ రాకెట్ GSLV-F15 ప్రయోగాన్ని ఇస్రో చేపట్టనుంది.
దీన్ని పురస్కరించుకుని ఇస్రో అధిపతి డా. సోమనాథ్ ఇటీవల ప్రధానిని కలిశారు. రాకెట్ ప్రయోగ వీక్షణకు రావాలని ఆయన ను ఆహ్వానించారు. రాకెట్ ప్రయోగం దృష్ట్యా క్షేత్రస్థాయిలో వివిధ కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించారు.