సాగు భూముల రిజిస్ట్రేషన్లు – మ్యుటేషన్ల సేవల పోర్టల్ ధరణి పేరును భూమాతగా మార్చేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

హైదరాబాద్ లో రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి నేతృత్వంలో ROR-2024, ధరణి అంశాలపై జరిగిన సమీక్షలో పేరు మార్పు ప్రతిపాదనకు CM రేవంత్ రెడ్డి ఆమోద ముద్ర వేసినట్లు తెలిసింది. అయితే ధరణి పేరు మార్పును అధికారికంగా మాత్రం ప్రకటించలేదు.