రాష్ట్రవ్యాప్తంగా 16 ప్రాంతాల్లో 1,767 కిలోమీటర్ల మేర రోడ్లను జాతీయ రహదారులు (NH)గా ఉన్నతీకరించడం లేదా జాతీయ రహదారులకు అనుసంధానించాలనేది రాష్ట్ర ప్రభుత్వ ఆలోచన.

జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (NHAI) మార్గదర్శకాలకు అనుగుణంగా ఆయా రోడ్ల వివరాలతో ఆకృతులు సిద్ధంచేసి మరోసారి కేంద్రానికి ఇవ్వడానికి ఏర్పాట్లు పూర్తిచేసింది. ఈ మేరకు త్వరలో నివేదికను కేంద్ర ఉపరితల రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీకి సమర్పించేందుకు ఏర్పాట్లు చేసింది.