సంక్రాంతి పందేలలో కాలు దువ్వేందుకు సింహపురి నుంచి కోడి పుంజులొచ్చేశాయి. నెల్లూరు ప్రాంతంలో పెంచిన కాకి, నెమలి, డేగ, పచ్చకాకి, కేతువ తదితర జాతుల పుంజులు పందేలరాయుళ్లను ఆకర్షిస్తున్నాయి.

రకాన్ని బట్టి ఒక్కొక్క పుంజు రూ.3 వేల నుంచి రూ.6 వేల వరకు విక్రయిస్తున్నారు. నెల్లూరు జిల్లాకు చెందిన వ్యాపారులు రావులపాలెం – ఏలూరు హైవే, రద్దీ రోడ్ల వెంబడి వీటిని విక్రయిస్తున్నారు.