మహాలక్ష్మి పథకం వల్ల RTC ఎక్స్ప్రెస్, ఆర్డినరీ బస్సుల్లో రద్దీ విపరీతంగా పెరిగింది. ఈ పథకం అమలులోకి రాకముందుతో పోలిస్తే ప్రస్తుతం బస్సుల్లో ప్రయాణికుల సంఖ్య దాదాపు రెట్టింపైంది.
దీంతో బస్సులు చాలక ప్రయాణికులు ఇబ్బందులు పడాల్సి వస్తోంది. ఈ సమస్యను అధిగమించేందుకు కొత్తగా 500 బస్సులు కొనుగోలు చేయాలని సంస్థ నిర్ణయించింది. ఈమేరకు ప్రభుత్వానికి ప్రతిపాదించబోతోంది.