అనుభవించాలంటే రాసిపెట్టుండాలి! ఐటీ ప్రోగ్రామర్ లాస్లో హనిఎజ్ విషయంలో ఇది అక్షరాలా నిజం! 2010, మే17న 10వేల బిట్ కాయిన్లను ఆయన డాలర్లలోకి మార్చుకున్నారు.
వచ్చిన $41తో మే 22న 2 పిజ్జాలు ఆర్డర్ చేశారు. ఇప్పుడా 10వేల BTCల విలువ రూ.8000 కోట్లు. ఇంతలా పెరుగుతుందని ఆయన అస్సలు ఊహించి ఉండరు. ఆ లావాదేవీకి గుర్తుగానే ఏటా మే 22ను బిట్కాయిన్ పిజ్జాడేగా జరుపుకుంటారు. BTC హోల్డర్లకు డిస్కౌంట్లు ఇస్తుంటారు.