క్రిస్మస్ పండుగ వచ్చిందంటే ఎక్కువగా చిన్న పిల్లలకు గుర్తుకు వచ్చే పేరు క్రిస్మస్ తాత. అయితే, క్రిస్మస్ తాత అసలు పేరు సెయింట్ నికోలస్.

చరిత్ర కారుల ప్రకారం 4వ శతాబ్దానికి చెందిన సెయిట్ నికోలస్ చర్చిలో ఒక బిషప్. అతడు కరుణ, దయ, సేవా కార్యక్రమాలలో ముందుండేవాడు. కాలక్రమంలో సెయింట్ నికోలస్ను శాంతా క్లాజ్, క్రిస్మస్ తాతగా పిలుచుకుంటున్నాము.