క్రిస్మస్ చెట్టు ఇంట్లో పెట్టుకోవడమనేది జర్మన్ ల నుంచి వచ్చిన సాంప్రదాయమని తెలుస్తోంది.
1923 నుంచి అమెరికా శ్వేతభవనంలో క్రిస్మస్ చెట్టు అమర్చడం ప్రారంభమైంది. దీంతో ప్రతి ఏడాది ఆ చెట్టుకున్న దీపాలను వెలిగించడం ద్వారా అమెరికాలో క్రిస్టమస్ వేడుకలు ప్రారంభమవుతాయి.
ఈ వేడుకల్లో ప్రధానాకర్షణ క్రిస్మస్ చెట్టుదే. సాధారణంగా ఇళ్లలో పెట్టుకునే క్రిస్మస్ చెట్లు ఇరవయ్యో శతాబ్దం వచ్చేసరికి బహిరంగ ప్రదేశాల్లోకి వచ్చేశాయి.