నాగార్జునసాగర్ ప్రధాన డ్యాం వద్ద కీలకపరిణామం చోటుచేసుకుంది. ఏపీ, తెలంగాణ మధ్య జలవివాదం నేపథ్యంలో CRPFకు కేంద్రం గతంలో బాధ్యతలు అప్పగించింది.
డ్యామ్ భద్రతా విధుల నుంచి CRPF వైదొలుగుతున్నట్లు చెప్పడంతో తెలంగాణ SPF ఆ బాధ్యతలు స్వీకరించింది. మళ్లీ రాత్రివిధుల్లోకి CRPF సిబ్బంది వచ్చి భద్రతా బాధ్యతలు చేపట్టాయి. దీంతో ఏం జరుగుతుందనేది తెలియక స్థానిక అధికారులు అయోమయానికి గురయ్యారు.