దేశంలో లగ్జరీ కార్ల వినియోగం పెరిగింది. రూ.50లక్షలకు పైబడిన ప్రీమియం మోడళ్ల కార్ల విక్రయం ఈ ఏడాది పెరిగింది. 2024లో గంటకు సగటు 6 కార్లు విక్రయించబడ్డాయి.

ఐదేళ్లక్రితం గంటకు రెండు లగ్జరీకార్లు మాత్రమే అమ్మకాలు జరిగేవి. కస్టమర్ల అభిరుచులు మారుతుండడం కారణంగానే అమ్మకాలు పెరిగాయని విశ్లేషకులు చెబుతున్నారు. 2023లో 48వేల కార్ల విక్రయం జరగ్గా.. ఈ ఏడాది 50వేల మార్కు దాటొచ్చనే టాక్ వినిపిస్తోంది.