దేవాదాయ శాఖలో కాంట్రాక్ట్ ప్రాతిపదికన 70 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. దీనిద్వారా అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (సివిల్) 35, ఎలక్ట్రికల్లో 5, టెక్నికల్ అసిస్టెంట్(సివిల్) 30 ఖాళీలను భర్తీ చేయనున్నారు.
AEE పోస్టులకు ఇంజనీరింగ్, టెక్నికల్ అసిస్టెంట్కు LCE డిప్లొమా చదివి ఉండాలి. AEEలకు రూ.35వేలు, TAలకు రూ.25వేల వేతనం అందుతుంది. దరఖాస్తుకు 2025 జనవరి 5 వరకు గడువు ఉంది.