కెనడా ప్రధాని రేసులో భారత సంతతికి చెందిన ‘రూబీ ధల్లా’ బరిలో దిగారు. లిబరల్ పార్టీ నుంచి ఆమె పోటీ చేస్తున్నారు.

తాజాగా ఆమె ‘ X ‘ వేదికగా సంచలన పోస్ట్ చేశారు. ‘నేను ప్రధానిగా ఎన్నికైతే అక్రమ వలసలపై ఉక్కుపాదం మోపుతాను. ‘ అని పోస్ట్ లో రాసుకొచ్చారు.

దీంతో నెటిజన్స్ రూబీని మరో ట్రంప్స్ అభివర్ణిస్తూ సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతున్నారు. కాగా ఆమె ఇప్పటికి మూడుసార్లు ఎంపీగా ఎన్నిక కావడం గమనార్హం.