చైనాపై సుంకాలు విధించాలన్న అమెరికా అధ్యక్షుడి ట్రంప్ నిర్ణయంపై చైనా వాణిజ్య మంత్రిత్వ శాఖ మండిపడింది. దీనిపై చైనా స్పందిస్తూ.. “అమెరికా నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నాం.

ఈ చర్యలతో అమెరికా సమస్యలు తీరకపోగా… సాధారణ ఆర్థిక వ్యవస్థ, వాణిజ్య సహకారాలు దెబ్బతింటాయి. ఇతర దేశాలను సుంకాలతో ప్రతిసారి బెదిరించకుండా… తన దేశంలో ఫెంటనిల్ వంటి సమస్యలను సొంతగా పరిష్కరించుకోవాలి. తప్పుడు పద్ధతులను అమెరికా సరిచేసుకోవాలని కోరుతున్నాం” అని పేర్కొంది.