మాఘ మాసంలోని శుక్ల పక్ష సప్తమి తిథి నాడు రథసప్తమి ఉపవాసం పాటిస్తారు. ఈ రోజు(మంగళవారం) కొన్ని పనులు చేయాలని పండితులు చెబుతున్నారు.
ఉదయాన్నే తలస్నానం చేసి రాగి పాత్రలో నీరు, ఎర్రచందనం, బియ్యం, ఎర్రపూలు వేసి దానిని ఛాతీ మధ్యలోకి తీసుకొచ్చి సూర్యునికి అభిముఖంగా సూర్య మంత్రాన్ని జపించాలి. ఈ రోజున సూర్య భగవానుడి ఉపవాసం ఉండాలి. దీని వల్ల అన్ని రకాల శారీరక నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుందట.