తమ దేశంలో ఉన్న అక్రమ వలసదారులను వారి వారి దేశాలకు పంపాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.
తాజాగా భారత్ కు చెందిన అక్రమ వలసదారుల విమానం ఇండియాకు బయలుదేరింది. ఈ విషయాన్ని అక్కడి అధికారులు వెల్లడించినట్లు వార్తా ఏజెన్సీ రాయిటర్స్ పేర్కొంది. ఆ విమానం భారత్కు చేరుకోవడానికి 24 గంటలు పట్టనుండగా… ఎంత మంది వలసదారులను తరలిస్తున్నారనే విషయం తెలియాల్సి ఉంది.