మహారాష్ట్ర సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో మరాఠీ భాషను తప్పనిసరి చేసింది.
ప్రభుత్వ ఉద్యోగులు మరాఠీలోనే మాట్లాడాలని.. లేకుంటే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆదేశాలు జారీ చేసింది. కార్యాలయాల్లో మరాఠీనే మాట్లాడేలా సైన్ బోర్డులు పెట్టాలని, కంప్యూటర్లకూ మరాఠీ భాష టైప్ చేసేలా కీబోర్డులు ఉండాలని ఆదేశించింది. మరాఠీ భాష పరిరక్షణ కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.