పాకిస్థాన్ లోని బలోచిస్తాన్ లో జాఫర్ రైలును హైజాక్ చేసిన ఘటనలో.. 27మంది ఉగ్రవాదులు హతమయ్యారు.
సుమారు 155మంది ప్రయాణికులను ఆ రైలు నుంచి రక్షించారు. మస్కఫ్ టన్నెల్ వద్ద ఆ రైలును దుండగులు అడ్డుకున్నారు. ప్రస్తుతం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతున్నది. తాజా ఆపరేషన్లో పది మంది భద్రతా సిబ్బంది కూడా ప్రాణాలు కోల్పోయారు. చివరి మిలిటెంట్ను హతమార్చే వరకు ఆపరేషన్ కొనసాగుతుందని అధికారులు చెప్పారు.
