అమెరికాలోని రాయబార కార్యాలయం అక్కడి భారతీయులకు అడ్వైజరీ జారీ చేసింది.
దౌత్యకార్యాలయం పేరుతో నకిలీ కాల్స్ వస్తున్నాయని… వాటిపట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఎట్టిపరిస్థితుల్లోనూ వ్యక్తిగత సమాచారం, క్రెడిట్కార్డు వివరాలు వెల్లడించవద్దని పేర్కొంది.
భారతీయుల నుండి డబ్బు వసూలు చేయడానికి కూడా వారు ప్రయత్నిస్తారన్నారు. పాస్పోర్టు, ఇమిగ్రేషన్ఫారమ్, వీసాలో తప్పులు ఉన్నాయని చెబుతూ సైబర్ నేరగాళ్లు ప్రజలను మోసగించే అవకాశం ఉందని హెచ్చరించింది.