అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రస్తుతం ప్రభుత్వ వ్యయం తగ్గింపుపై దృష్టిపెట్టారు. అందులోభాగంగా విద్యాశాఖలోని సిబ్బందిని తొలగించే ప్రయత్నాల్లో ఉన్నట్లు తెలుస్తోంది.

విద్యాశాఖ మంత్రిగా లిండా మెక్మాన్ బాధ్యతలు స్వీకరించిన ఐదు రోజుల్లోనే సిబ్బంది తొలగింపునకు సిద్ధమయ్యారట. ‘విద్యాశాఖలో ప్రక్షాళన మొదలు పెట్టాం… అవసరమయితే ఉద్యోగులను తొలగిస్తాం’ అని లిండా పేర్కొన్నారు.