ఫోన్ రాగానే ప్రతి ఒక్కరూ పలికే తొలి మాట హలో…

ఈ పదం టెలిఫోన్ ఆవిష్కరణ కాకముందు నుంచే వాడుకలో ఉంది. ఆక్స్ఫర్డ్ డిక్షనరీ ప్రకారం holla, hollo అనే పదాల నుంచి hello వచ్చింది. దూరంగా ఉన్న వ్యక్తిని పిలిచేందుకు ఈ పదాన్ని వాడతారు.

తొలుత టెలిఫోన్ డైరెక్టరీల లో హలో అంటూ సంభాషణ మొదలు పెట్టాలని సూచించారు. దీంతో అందరూ హలో అనడం ప్రారంభించారు. ప్రస్తుతం వాట్సప్ బ్రో, హాయ్, హేయ్ అంటూ పలకరిస్తున్నారు.