ఇటీవలికాలంలో కాల్ డ్రాప్ సమస్య తీవ్రంగా వేధిస్తోందని ఓ సర్వేలో తేలింది. కాల్ కనెక్ట్ అవ్వడంలో ఇబ్బంది ఎదురవుతోందని.. కాల్ మాట్లాడుతున్న సమయంలో అకస్మాత్తుగా ఆగిపోతోందని 89% మంది మొబైల్ వినియోగదారులు వెల్లడించారు.

సమస్యను తరుచూ ఎదుర్కొంటున్నామని 40% మంది తెలిపారని లోకల్ సర్కిల్స్ నివేదిక స్పష్టం చేసింది.

కాల్ డ్రాప్ పై ట్రాయ్ తీసుకొచ్చిన నిబంధనలు, జరిమానాల ప్రభావాన్ని తెలుసుకునేందుకు సర్వే చేపట్టినట్లు వివరించింది.