చార్ ధామ్ యాత్రలో పాల్గొనే వారి సంఖ్య గత సీజన్ తో పోలిస్తే తగ్గిందని ఉత్తరాఖండ్ లోని డెహ్రాడూన్ కు చెందిన SDCఫౌండేషన్ అనే పర్యావరణసంస్థ వెల్లడించింది.

2024లో యాత్ర తొలి రెండువారాల్లో దర్శించుకున్న వారితో పోలిస్తే ఈ ఏడాది అదే సమయంలో 31 శాతం మంది తక్కువగా యాత్రలో పాల్గొన్నారని పేర్కొంది. పహల్గాం ఘటన, అనంతరం సరిహద్దుల్లో పాకిస్థాన్ తో నెలకొన్న ఉద్రిక్తతలే ఇందుకు కారణంగా భావిస్తున్నాం అని పేర్కొంది.