పాకిస్తాన్ ప్రధాని కీలక ప్రకటన చేశారు. ప్రస్తుత పరిస్థితుల లో భారతదేశంతో శాంతి చర్చలకు తాను సిద్ధంగా ఉన్నానని పాకిస్తాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ గురువారం అన్నారు.

ముందుగా కాశ్మీర్ వివాదం, నీటి పంపిణీతో సహా ద్వైపాక్షిక సమస్యలను పరిష్కరించడానికి సమగ్ర చర్చలకు రావాలని భారత్ ను ఆహ్వానించారు. భారతదేశం, పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణను ఇప్పుడు మే 18వరకు పొడిగించినట్లు పాక్ ఇప్పటికే ప్రకటించింది.